స్పిరిట్ లుక్ కాపీ కొట్టిన టాలీవుడ్ హీరో ?

by velandi.Saikiran |   (  Updated:2026-01-01 19:40:39  IST  )

స్పిరిట్ పోస్టర్ తరహాలోనే ఎన్టీఆర్ ఫోటోలు ఎడిట్ చేసి పెట్టారు. హీరోయిన్ గా తృప్తి స్థానంలో రుక్మిణి వసంత్ ను పెట్టారు.

స్పిరిట్ లుక్ కాపీ కొట్టిన టాలీవుడ్ హీరో ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్ గా తృప్తి డిమ్రి (Triptii Dimri) మెరవనున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, కొత్త సంవత్సరం కానుకగా అర్ధరాత్రి ఓ పోస్టర్ కూడా వదిలింది చిత్ర బృందం. ఇందులో ప్రభాస్ తీవ్రమైన గాయాలతో ఉన్నాడు. ఒళ్లంతా కాలిపోయి, నాలుగు ఐదు బ్యాండేజీలు పెట్టుకొని మెరిశాడు.

అదే సమయంలో హీరోయిన్ తృప్తి డిమ్రి సిగరెట్ వెలిగిస్తూ మెరిసింది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే స్పిరిట్ పోస్టర్ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఎడిట్ చేసి పెట్టారు. హీరోయిన్ గా తృప్తి స్థానంలో రుక్మిణి వసంత్ ను పెట్టారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ కంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ఫోజ్ బాగా సెట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Next Story