- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవర 2 లో భారీ మార్పులు...షాక్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ( NTR) ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ( NTR) ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్... ఆ రేంజ్ కు తగ్గకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొరటాల శివ ( Koratala Siva) దర్శకత్వంలో... దేవర సినిమా ( Devara) తీశారు జూనియర్ ఎన్టీఆర్.
సముద్రంలో జరిగే స్మగ్లింగ్ ఆధారంగా ఈ దేవర సినిమాను తీశారు కొరటాల శివ. అయితే సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదో మిస్సయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అసలు విశ్వరూపాన్ని ఎక్కడ చూపించలేదు. ఆయన పాత్ర కాస్త చప్పగా ఉందని ఫ్యాన్స్ అనుకునేలా దర్శకుడు.. కథ రాసుకోచ్చారు. అయితే సినిమాలో కాస్త మాస్ యాంగిల్ పెడితే... RRR కంటే బ్రహ్మాండంగా విజయాన్ని నమోదు చేసుకునేదని.. చాలామంది అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పుడు దేవర పార్ట్ 2 లో ( Devara 2) మాత్రం ఖచ్చితంగా మార్పులు చేయాలని దర్శకుడు కొరటాల శివను డిమాండ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ లో ఎన్టీఆర్ ను వాడుకోవడంలో కొరటాల శివ ఫెయిల్యూర్ అయ్యారని... కానీ పార్ట్-2లో మాత్రం... సక్సెస్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన పాత్రను పవర్ ఫుల్ గా చూపించాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. అలా చేస్తే పార్ట్ 2 మంచి విజయాన్ని నమోదు చేస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా కొరటాల శివ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.






