ఆయన ఆశీస్సులు ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఆపలేరు: ఎన్టీఆర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-10 17:25:01  IST  )

వార్ 2 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 25ఏళ్లుగా తనను ప్రోత్సహిస్తున్న మీడియాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఆయన ఆశీస్సులు ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఆపలేరు: ఎన్టీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: వార్ 2 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 25ఏళ్లుగా తనను ప్రోత్సహిస్తున్న మీడియాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎన్ని సంవ‌త్స‌రాలు, ఎన్ని యుగాలు దాటినా నంద‌మూరి తార‌క‌రామారావు ఆశీస్సులు త‌నపై ఉన్నంత వ‌ర‌కు ఎవ‌రూ ఆప‌లేర‌ని చెప్పారు. వార్ 2 సినిమాలోని పాట‌లో ఒక‌రు త‌క్కువ‌, ఎక్కువ అని చూపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని అది నిజం కాద‌న్నారు. ఈ సినిమాలోని పాట ఇద్ద‌రు మంచి డాన్స‌ర్ల మ‌ధ్య పోటీ కాదు, మంచి డ్యాన్స‌ర్ల మ‌ధ్య కాంప్లిమెంట్స్ అని చెప్పారు.

నేను మీకు న‌చ్చిన డ్యాన్స‌ర్ అయ్యి ఉండొచ్చు కానీ మ‌న‌కంటే మంచి డ్యాన్స‌ర్లు చాలా మంది ఉన్నారు దానిని మ‌నం అంగీక‌రించాల‌ని చెప్పారు. ఇది గుర్తు పెట్టుకోవాల‌ని, మీ ప‌ద్ధ‌తి మీది.. నా ప‌ద్ద‌తి నాది అని అభిమానుల‌కు చెప్పారు. డ్యాన్స్ లో త‌న‌కు మైకేల్ జాక్స‌న్ త‌ప్ప ఎవ‌రూ క‌నిపించ‌ర‌ని అన్నారు. కానీ క‌హోనా ప్యార్ హై సినిమాలో హృతిక్ డ్యాన్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌ని తెలిపారు. ఇండియాలోని గొప్ప డ్యాన్స‌ర్ల‌లో హృతిక్ రోష‌న్ కూడా ఒక‌రు అని చెప్పారు. ఆయనను ఎంతో అభిమానించానని ఇప్పుడు ఆయన పక్కనే నటించే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

సెట్‌లో తారక్‌ను చూసి చాలా నేర్చుకున్నా..హృతిక్ రోష‌న్ షాకింగ్ కామెంట్స్

Next Story