- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరోయిన్ భర్తతో కలిసి రోడ్డు మీద స్కూటీ నేర్చుకుంటున్న ఎన్టీఆర్ బ్యూటీ.. సూపర్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్
అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘దేవర’(Devara) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ప్రజెంట్ రామ్ చరణ్(Ram Charan) సరసన ‘పెద్ది’(Peddi) సినిమాలో నటిస్తుంది. ఇక దీనికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది జాన్వీ. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) తనకు స్కూటీ నేర్పిస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నేను తనని రైడ్‌కి తీసుకెళ్తే పరమ్‌కి చాలా ఇష్టం’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది.
దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఆన్ స్క్రీన్ మీ జంట చాలా బాగుంది, సూపర్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా జాన్వీ, సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న మూవీ ‘పరమ్ సుందరి’(Param Sundari). దీనికి తుషార్ జలోటా(Tushar Jalota) దర్శకత్వం వహించగా.. ఈ మూవీ గ్రాండ్‌గా జులై25లో విడుదల కానుంది. ఇక ప్రమోషన్లలో భాగంగానే వీరు ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.






