'డ్రాగన్'లో 'లూగర్'గా ఎన్టీఆర్..ఆ పేరు వెనుక అస‌లు క‌థ ఇదే?

by velandi.Saikiran |

డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు LUGER. అయితే దీని అర్థం ఏంటని సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు.

డ్రాగన్లో లూగర్గా ఎన్టీఆర్..ఆ పేరు వెనుక అస‌లు క‌థ ఇదే?
X

దిశ‌, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తాజాగా డ్రాగన్ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. నిన్న అర్ధరాత్రి రిలీజ్ అయిన గ్లింప్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర పేరు LUGER గా దర్శకుడు నీల్ ఫైనల్ చేశారు. అటు ఈ గ్లింప్స్ లో రగ్గ్ డ్ లుక్స్ లో కనిపించగా, అతని డైలాగ్స్ కూడా అదిరిపోయాయి.

ఎన్టీఆర్ LUGER అర్థం ఏంటి అంటే ?

డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు LUGER. అయితే దీని అర్థం ఏంటని సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. గూగుల్ ప్రకారం LUGER అనేది జర్మనీ 9MM సెమీ ఆటోమేటిక్ పిస్టల్. ఇది రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జర్మనీ సైన్యానికి ప్రామాణిక సర్వీస్ పిస్టల్ గా ఉండేదని తేలింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఈ పేరుకు గల అర్థం ఏంటో మేకర్స్ నుంచి మాత్రం క్లారిటీ లేదు. కాగా 1967 కాలం నాటి అంతర్జాతీయ నల్లమందు స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో ఈ డ్రాగన్ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ మూవీ 2027 జూన్ 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Next Story