BREAKING: కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు.. అరెస్ట్ తప్పదా?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-08 05:47:05  IST  )

విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ కేసులో టాలీవుడ్ నటుడు మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు.

BREAKING: కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు.. అరెస్ట్ తప్పదా?
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ కేసులో టాలీవుడ్ నటుడు మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. కాగా మంచు విష్ణు ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న షూటింగ్ షెడ్యూల్ కారణంగా 15వ తేదీ తరవాత విచారణకు వస్తానని చెప్పారు. ఇప్పటికే పీఆర్వో సతీష్ సమా మరో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మోహన్ బాబుకు ఇంకా నోటీసులు అందలేదని సమాచారం. ఇదిలా ఉంటే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నిరసన తెలిపేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ కేసులో ఎఫ్ఐఆర్ పీఆర్వో సతీష్ పేరు ఏ1గా, మంచు విష్ణు పేరు ఏ2గా చేర్చారు. అంతే కాకుండా మోహన్ బాబు పేరును ఏ3గా చేర్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు యాజమాన్యం ప్రోద్భలంతోనే కిడ్నాప్ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని మోహన్ బాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

అనిల్ రావిపూడి-వెంకటేష్ కొత్త సినిమా.. కథ తెలిస్తే షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే

Next Story