ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు.. ప్రియదర్శి ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

వరుస విజయాలతో ప్రియదర్శి(Priyadarshi) మంచి ఊపు మీద ఉన్నారు.

ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు.. ప్రియదర్శి ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: వరుస విజయాలతో ప్రియదర్శి(Priyadarshi) మంచి ఊపు మీద ఉన్నారు. ఆయన హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్(Sivalenka Krishna Prasad) నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి(Mohana Krishna Indraganti) తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ‘‘సారంగపాణి జాతకం’(Sarangapani Jathakam) కథ లాస్ట్ ఇయర్ విన్నాను. ఈ చిత్రం గత ఏడాది చివర్లో రావాల్సింది. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తున్నాం. కోర్టు లాంటి హిట్ తర్వాత మళ్లీ వెంటనే ‘సారంగపాణి జాతకం’ అని వస్తుండటం ఆనందంగా ఉంది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎలాంటి ఒత్తిడి లేదు. ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు. మంచి సినిమాను చేయాలని ప్రయత్నిస్తాం. ఫలితం మన చేతుల్లో ఉండదు. ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేద్దామని అనుకున్నాం.

కానీ బిజినెస్ పరంగా, థియేటర్ల పరంగా అన్నీ లెక్కేసుకుని ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తున్నాం. అయితే జాతకాలు నమ్మాలి అని కానీ నమ్మకూడదు అని కానీ మేం చెప్పం. కానీ ఒకరి నమ్మకాల్ని ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తాం. ఏ సైడ్ తీసుకుని మాత్రం కథను చెప్పలేదు. ఇంత వరకు నేను ఎక్కువగా తెలంగాణ మాండలికంలోనే ఎక్కువగా మాట్లాడాను. కానీ ఈ సారి మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడతాను. ఇంద్రగంటి గారి స్టైల్‌లోనే మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన నా కోసం ఇందులో సెపరేట్ ట్రాక్, టైమింగ్‌ను సెట్ చేశారు. అది అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఇండస్ట్రీలోకి రాకముందు జాతకాలు చూపిస్తే అస్సలు నేను యాక్టర్‌ని అవ్వను అని చెప్పారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. మా అమ్మ తన కొడుకు ఏమైపోతాడో అని అలా జాతకం చూపించారు. కానీ నేను నా మీద నమ్మకంతో వచ్చాను. చేసే పని మీద నేను నమ్మకం పెట్టుకుంటున్నానంతే’’ అని చెప్పుకొచ్చారు.

Next Story