సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

by Bhoopathi Nagaiah |

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో మ్యూజిక్ డైరెక్టర్ శకం ముగిసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సబేష్ గురువారం ఉదయం కన్నుమూశారు.

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత
X

దిశ, సినిమా : ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో మ్యూజిక్ డైరెక్టర్ శకం ముగిసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సబేష్ గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. సబేష్ మరణం కోలీవుడ్ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేశారు. కాగా సబేష్‌కు సంగీత దర్శకుడు దేవా సొంత సోదరుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించారు. సబేష్ గాయకుడిగానూ రాణించారు. వీరి మరో సోదరుడు మురళి సైతం సంగీత దర్శకుడు కావడం విశేషం. సబేష్, మురళి జంట సంగీత దర్శకులుగా పేరుగాంచారు. వీరిద్దరు సినిమాలనే కాకుండా ఎన్నో పేరొందిన ప్రైవేట్ ఆల్భమ్‌లను రూపొందించారు. సుబేష్ కుమారుడు కార్తీక్ ప్రస్తుతం హాస్యనటుడిగా తమిళ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Next Story