- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడుదల విషయంలోనే కాదు.. రన్ టైంలో కూడా పోటీ పడుతున్న 'ధురంధర్ 2'.. 'టాక్సిక్'.
ధురంధర్ 2 ఏకంగా 3 గంటల 40 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుండగా, టాక్సిక్ 3 గంటల 15 లేదా 25 నిమిషాల రన్ టైంతో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : సినిమా నిడివి మూడు గంటల కంటే ఎక్కువ ఉంటే చాలా ప్రమాదం అని, భారీ రన్ టైంతో మూవీ వచ్చినట్లయితే అది ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోవాలి, ఎక్కడైనా కాస్త సినిమా పక్కదారి పట్టినా కూడా ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానితో మూవీ వారికి బోర్ కొట్టి సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సినిమాను తక్కువ రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మంచిదని చాలామంది భావిస్తూ ఉంటారు.
కానీ ఈ మధ్యకాలంలో మాత్రం స్టార్ హీరోలు నటించిన చాలా సినిమాలు దాదాపు మూడు గంటలు, మూడు గంటలకు పైగా రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో చాలా వరకు మంచి విజయాలను కూడా అందుకుంటున్నాయి. ఈ సమ్మర్ కానుకగా మార్చి 19వ తేదీన రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన ధురంధర్ 2, యాష్ నటించిన టాక్సిక్ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై ఇండియావ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు క్రేజీ చిత్రాలు విడుదల విషయంలో మాత్రమే కాదు, రన్ టైం విషయంలో కూడా అదే స్థాయిలో పోటీ పడుతున్నాయి.
ఈ రెండు సినిమాలు కూడా మూడు గంటలకు మించిన రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ధురంధర్ 2 ఏకంగా 3 గంటల 40 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుండగా, టాక్సిక్ 3 గంటల 15 లేదా 25 నిమిషాల రన్ టైంతో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో ఈ రెండు సినిమాలు విడుదల విషయంలో మాత్రమే కాదు, రన్ టైం విషయంలో కూడా పోటీపడుతున్నట్లు చాలామంది అభిప్రాయపడుతున్నారు.






