- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి విజయానికి కెమెరాల గుర్తింపు అవసరం లేదు మిత్రమా.. ఆలియాకు మద్దతుగా సోనూ సూద్ పోస్ట్
నెగిటివిటీపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ ఆలియా భట్‌కు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా ఒక పవర్‌ఫుల్ నోట్ షేర్ చేశారు.

దిశ, సినిమా: ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమె రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు అంతర్జాతీయ మీడియా ఆమెను పెద్దగా పట్టించుకోలేదంటూ నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఇలా మెసెజ్ పెట్టగా.. దానికి ఆలియా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. అయ్యో పాపం అనే మాట ఎందుకులెండి. మీరు నన్ను గర్తించారు కదా అని రిప్లై ఇచ్చింది. ఈ విషయంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, ఈ నెగిటివిటీపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ ఆలియా భట్‌కు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా ఒక పవర్‌ఫుల్ నోట్ షేర్ చేశారు.
"మన దేశానికి చెందిన ఒక వ్యక్తి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టినప్పుడు, అది మనకు గర్వకారణం కావాలి. అంతేగానీ అందులో తప్పులు వెతకకూడదు. ప్రతి విజయానికి కెమెరాలు, హెడ్‌లైన్స్ లేదా తెలియని వ్యక్తుల గుర్తింపు అవసరం లేదు. అక్కడ నిలబడే ధైర్యం చేయడం, మన కళకు ప్రాతినిధ్యం వహించడం, ఆ ప్రయాణాన్ని హుందాగా ముందుకు తీసుకెళ్లడమే ఒక గొప్ప విజయం" అని రాసుకొచ్చారు. అలాగే, "ట్రోలింగ్‌కు అలవాటు పడిన ఈ ప్రపంచంలో, ఇతరులను ప్రోత్సహించడం నేర్చుకోండి. ఎందుకంటే తమ కలలను నిర్మించుకునే బిజీలో ఉన్నవారికి, ఇతరులను కిందికి లాగే సమయం ఉండదు. కీప్ షైనింగ్ మై ఫ్రెండ్.. చూడాల్సిన వాళ్లు నీ ప్రతిభను చూశారు" అంటూ ఆలియాకు ధైర్యం చెప్పారు.






