- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB 29: మహేష్ బాబుతో జక్కన్న ప్లాన్ అదుర్స్..టాలీవుడ్ లోనే తొలిసారి !
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. ఇప్పటికి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. ఏజ్ పైబడినప్పటికీ... యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకు వెళ్తున్నారు. అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్... ఈ సినిమాకు పెడుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అతి త్వరలోనే ఈ సినిమా గురించి కీలక అప్డేట్స్ వస్తాయి.
అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో గతంలో ఏ దర్శకుడు.. మహేష్ బాబుతో చేయని రిస్క్ ను జక్కన్న చేయిస్తున్నాడట. ఈ సినిమాలో... ఫైటింగ్ సీన్స్ అలాగే స్టంట్స్ అన్నీ కూడా మహేష్ బాబు మాత్రమే చేస్తున్నారట. మరో వ్యక్తితో... చేయించడం లేదని తెలుస్తోంది. అంటే స్టంట్ డబుల్ కు ఈ సినిమాలో ఛాన్స్ లేదని తెలుస్తోంది. ప్రతి సీన్ మహేష్ బాబు తోనే చేయించబోతున్నారట రాజమౌళి. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.






