ఈ సినిమా చూసి భయపడకుండా ఎవరూ బయటకు రాలేరు.. ఇక్కడితో ఆగదంటూ అజయ్ సంచలన ప్రకటన

by Mallepaka Hamsa |

డిమాంటీ కాలనీ-3 సినిమా చాలా భారమైన, ఉత్కంఠభరితమైన, తీవ్రంగా భయపెట్టే చిత్రంగా ఉండబోతోంది. థియేటర్‌లో ఈ మూవీ చూసి భయపడకుండా ఎవరూ బయటకు రాలేరు.

ఈ సినిమా చూసి భయపడకుండా ఎవరూ బయటకు రాలేరు.. ఇక్కడితో ఆగదంటూ అజయ్ సంచలన ప్రకటన
X

దిశ, సినిమా: అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సరికొత్త హారర్ థ్రిల్లర్ ‘డిమాంటీ కాలనీ-3’. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘డిమాంటీ కాలనీ-2’ సినిమాకు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అరుళ్ నిధితో పాటు విలక్షణ నటుడు గురు సోమసుందరం ఒక కీలకమైన 'లైబ్రేరియన్' పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటూ త్వరలోనే థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈక్రమంలో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు, ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. "డిమాంటీ కాలనీ-3 సినిమా చాలా భారమైన, ఉత్కంఠభరితమైన, తీవ్రంగా భయపెట్టే చిత్రంగా ఉండబోతోంది. థియేటర్‌లో ఈ మూవీ చూసి భయపడకుండా ఎవరూ బయటకు రాలేరు.

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరాంటినో ఒకసారి.. 'మీరు సినిమాను అధ్యయనం చేయలేరు, కేవలం అనుభూతి చెందగలరు' అన్నారు. అది వంద శాతం నిజం, నేను ఈ చిత్రం విషయంలో ఆ భయాన్ని అనుభూతి చెందాను" అని అజయ్ తెలిపారు. మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు దానికి సీక్వెల్స్ తీయాలనే ఆలోచన లేదని, కేవలం ఒకే ఒక సినిమాగా తీశామని డైరెక్టర్ స్పష్టం చేశారు. అయితే రెండో భాగం తీసేటప్పుడు మాత్రం, కథలోని లాజిక్‌లను వివరిస్తూ మొదటి భాగానికి అనుసంధానించడం పెద్ద సవాలుగా మారిందని అన్నారు. తనకు లెజెండరీ దర్శకుడు హిచ్‌కాక్ సినిమాలు అంటే చాలా ఇష్టమని, ఆయన థ్రిల్లర్ చిత్రాల్లో ఎంతో కచ్చితత్వం ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ హారర్ సిరీస్‌ను ఇక్కడితో ఆపడం లేదని.. 'డిమాంటీ కాలనీ కథను డిమాంటీ కాలనీ-4, డిమాంటీ కాలనీ-5, డిమాంటీ కాలనీ-6 వరకు' కొనసాగించేలా ముందే ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు అజయ్ జ్ఞానముత్తు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story