Raghava Lawrence: బెంజ్ నుంచి మేజర్ అప్‌డేట్ వచ్చేసింది.. విలన్ క్యారెక్టర్‌లో అదరగొట్టిన స్టార్ హీరో

by Chukka Sudharani |   (  Updated:2025-06-04 15:04:38  IST  )

రాఘవా లారెన్స్ (Raghava Lawrence) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BENZ’.

Raghava Lawrence: బెంజ్ నుంచి మేజర్ అప్‌డేట్ వచ్చేసింది.. విలన్ క్యారెక్టర్‌లో అదరగొట్టిన స్టార్ హీరో
X

దిశ, సినిమా: రాఘవా లారెన్స్ (Raghava Lawrence) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BENZ’. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తు్న్న ఈ సినిమా నుంచి.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తప్ప మరో అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం లారెన్స్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ‘బెంజ్’ మూవీలో విలన్‌గా మలయాళ స్టార్ నివిన్ పౌలీ నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం.

అంతే కాకుండా.. తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నివిన్ పౌలీ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. ‘బెంజ్‌లో ‘వాల్టర్’ గా నటించడం చాలా ఆనందంగా ఉంది. అతను తీవ్రమైనవాడు, భిన్నంగా ఉంటాడు.. దీని కోసం అతను సిద్ధంగా ఉన్నాడు.. మీరు కూడా 'బెంజ్' కి సిద్ధంగా ఉండండి’ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఒళ్లంతా గోల్డ్, వాచ్, చివరకు పళ్లు కూడా బంగారంతోనే ఉన్న నివిన్ లుక్ వేరే లెవల్‌లో ఉంది. వీడియో చివర్లో తన పేరు 'వాల్టర్' అని చెప్పడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నివిన్ పౌలీ క్యారెక్టర్ ఈ సినిమాకు మేజర్ పాయింట్‌గా అపిస్తుంది.

Next Story