- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదలైన నివేత పేతురాజ్ సందడి.. ఒకేసారి రెండు క్రేజీ సినిమాల్లో ఛాన్స్?
‘ఆదర్శ కుటుంబం AK 47’తో పాటు ‘మెగా 158’ చిత్రంలో కూడా నివేత పేతురాజ్‌కు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ నటి నివేత పేతురాజ్. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించిన ఈమె తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవల కాలంలో నివేత పెద్దగా సినిమాల్లో కనిపించకపోవడంతో, ఆమె సినిమాలకు దూరమవుతోందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు నివేత పేతురాజ్ మళ్లీ ఫుల్ బిజీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం AK 47’ చిత్రంలో ఈమెకు కీలక పాత్రలో అవకాశం దక్కినట్లు సమాచారం.
అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా నివేతకు ఛాన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కూడా నివేత పేతురాజ్‌కు కీలక పాత్ర దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రస్తుతం ఈ నటికి రెండు క్రేజీ చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే నివేత పేతురాజ్ సందడి మళ్లీ మొదలైనట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






