వెంకటేష్‌కు సెకండ్ హీరోయిన్ ఫిక్స్!

by Chukka Sudharani |   (  Updated:2026-05-22 15:50:55  IST  )

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ కంటే, సెకండ్ హీరోయిన్‌కు ఎక్కువ క్రేజ్ వస్తుంది.

వెంకటేష్‌కు సెకండ్ హీరోయిన్ ఫిక్స్!
X

దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ కంటే, సెకండ్ హీరోయిన్‌కు ఎక్కువ క్రేజ్ వస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఈ డైరెక్టర్ ఎక్కువ సెకండ్ హీరోయిన్ మీదనే ఫోకస్ చేస్తాడు. ఈయన సినిమా వస్తుంది అంటే సెకండ్ హీరోయిన్ కంపల్సరీ అన్నా మాట. ఈ క్రమంలోనే ‘అల వైకుంఠపురం’లో పూజా హెగ్డే కంటే ఎక్కువ అభిమానుల దృష్టిని ఆకర్షించిన నివేదా పేతురాజ్‌ను ఇప్పుడు మరోసారి తన సినిమాలో భాగం చేయాలనుకుంటున్నాడట ఈ డైరెక్టర్. ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా పాన్ ఇండియా బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుండగా.. సెకండ్ హీరోయిన్‌గా నివేదా పెతురాజ్‌ను ఫైనల్ చేసినట్లు టాక్. ఇప్పటికే అల.. వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నివేదా కనిపించగా ఇప్పుడు ఈ చిత్రంలో కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story