- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాలోకి నివేదా ఎంట్రీ.. ‘ఆదర్శ కుటుంబం’ నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల
ఈ కాలం ఆడవాళ్లకి కేవలం ఆటిట్యూడ్ తప్ప ఏమాత్రం గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు అని ఫైర్ అవుతారు. సరిగ్గా అదే సమయానికి ఎదురుగా నివేదా పేతురాజ్ ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘సింగ్ గీతం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం మెగా 158 ప్రాజెక్టులో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న క్రమంలోనే విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ వీడియోను విడుదల చేసి ఓ క్రేజీ విషయాన్ని తెలియజేసింది. ఇందులో నివేదా స్పెషల్ సాంగ్‌లో కాకుండా.. కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించి ఆసక్తిని పెంచారు. ప్రఇక విడుదలైన వీడియోలో.. వెంకటేష్ తన ఇంట్లోంచి చాలా కోపంగా బయటకు వస్తూ, ఈ కాలం ఆడవాళ్లకి కేవలం ఆటిట్యూడ్ తప్ప ఏమాత్రం గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు అని ఫైర్ అవుతారు. సరిగ్గా అదే సమయానికి ఎదురుగా నివేదా పేతురాజ్ ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తుంది.
ఆ వెంటనే వెంకటేష్ స్పందిస్తూ, అదండి ఆడది అంటే కనపడగానే పువ్వులాగా ఎలా నవ్వుతుందో చూడండి, నా పెళ్ళాం ఉంది ఎందుకు ఎప్పుడు పెళ్లి ఫొటోల్లో కెమెరామెన్ స్మైల్ ప్లీజ్ అంటే అప్పుడు నవ్వింది, మళ్లీ ఇప్పటిదాకా అసలు నవ్వలేదు, ఎప్పుడు చూసినా మొహం అలా పెట్టుకుని ఉంటుంది అని తన భార్య గురించి ఎంతో ఫన్నీగా చెబుతారు. ఆ డైలాగ్ చెప్పిన వెంటనే కమెడియన్ సత్య అక్కడికి వచ్చి, ఊరుకో నాయనా ఇది మన ‘ఆదర్శ కుటుంబం’ అని సర్దిచెప్పడంతో ఆ వీడియో ఎంతో సరదాగా ముగుస్తుంది. నివేదా పేతురాజ్ గ్లామర్ ఎంట్రీతో, వెంకటేష్ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇక ఇందులో శ్రీనిధి స్వర్ణ పాత్రలో కనిపిస్తుండగా.. నివేదా వెంకటేష్ ప్రియురాలిగా నటిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. వెంకటేష్ సినీ ప్రయాణంలో ఇది 77వ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కీలక పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో భారీ స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.






