- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nithin: ఎమోషన్‌కు యాక్షన్ తోడైతే.. ట్రైలర్‌తోనే సినిమాపై సూపర్ హైప్!
హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీని శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.

దిశ, సినిమా: హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీని శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నా ఈ సినిమా జూలై 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
‘మీ అక్కను చూశావా..? తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ, క్యారక్టర్‌ను మాత్రం లూజ్ అవ్వలేదు’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో ‘చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే చాన్స్ వచ్చింది.. నిలబెడతా’ అంటూ నితిన్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక ట్రైలర్ బట్టి చూస్తే అక్క మాటని నిలబెట్టే తమ్ముడి కథ ఇదని తెలుస్తోంది. అలాగే ఎమెషన్‌కు యాక్షన్ తోడైతే ఎలా ఉంటుంది అనేది ఈ ట్రైలర్ అర్థం అవుతోంది. మొత్తంగా ‘తమ్ముడు’ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్, యాక్షన్ అంశాలతో అంచనాలు పెంచేలా ఉంది.






