Nithin : తమ్ముడు ట్రైలర్ అప్డేట్.. బిగ్ స్క్రీన్లపై పవర్-ప్యాక్డ్ యాక్షన్ అంటూ పోస్ట్

by Chukka Sudharani |

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’.

Nithin : తమ్ముడు ట్రైలర్ అప్డేట్.. బిగ్ స్క్రీన్లపై పవర్-ప్యాక్డ్ యాక్షన్ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థ్రియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో.. జోరు పెంచిన చిత్ర బృందం సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న లయ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేస్తు్న్నట్లు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

అలాగే.. ‘తమ్ముడు’ ట్రైలర్‌ను ‘కుబేర’ మూవీ థియేటర్స్‌లో ప్లే చేస్తున్నట్లు ప్రకటించారు. ‘బిగ్ స్క్రీన్లపై పవర్-ప్యాక్డ్ యాక్షన్ & ఎమోషన్‌ను అనుభవించండి.. తమ్ముడు ట్రైలర్ కుబేరా మూవీకి జోడించబడింది’ అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tweet

Next Story