- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైన్స్ ఫిక్షన్‌తో వస్తున్న నితిన్
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ తన 36 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెర్సటైల్ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

దిశ, సినిమా : వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ తన 36 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెర్సటైల్ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పవన్ కుమార్ సమర్పణలో సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రథ సప్తమి సందర్భంగా సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. విభిన్నమైన కథలు, కథనాలతో సినిమాలను రూపొందించే దర్శకుడు వి.ఐ.ఆనంద్ మరోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్ బౌండరీస్ రేంజ్‌ను మరింత పెంచటానికి సిద్ధమయ్యారు. సినీ ప్రేక్షకులకు ఇప్పటి వరకు చూడని సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా ఈ క్రేజీ సినిమా రూపొందనుంది. ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం తర్వాత ఈ విజనరీ డైరెక్టర్ హై కాన్సెప్ట్ సైఫై ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను మెప్పించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.






