మరోసారి 'సితార'లో నితిన్?

by Pulgam srinivas |

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మూడో సినిమాకు సిద్ధమైన నితిన్

మరోసారి సితారలో నితిన్?
X

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత డేంజర్ జోన్‌లో కెరీర్‌ను కొనసాగిస్తున్న హీరోల్లో నితిన్ ఒకరిగా కనిపిస్తున్నారు. ఈయనకు ఆఖరుగా 2020లో విడుదలైన ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయం దక్కింది. ఆ తర్వాత నుండి ఆయన నటించిన పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, నితిన్ తదుపరి సినిమాలపై ఆసక్తి నెలకొంది. నితిన్‌కు బాగా కలిసి వచ్చిన నిర్మాణ సంస్థల్లో సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ముందు వరుసలో ఉంటుంది. ఈ బ్యానర్‌లో ఆయన ఇప్పటికే ‘భీష్మ’, ‘రంగ్ దే’ వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించారు.

తాజాగా ముచ్చటగా మూడోసారి ఈ బ్యానర్‌లోనే నితిన్ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ దాదాపు పూర్తయినట్లు, మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, నితిన్ వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మూవీపై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అలాగే ‘ఆయ్’ చిత్ర దర్శకుడు అంజి కె మణిపుత్రతో కూడా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది.

Next Story