- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెబ్యూ డైరెక్టర్‌తో నితిన్ కొత్త సినిమా.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్
ఫైనల్‌గా నితిన్ కొత్త సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

దిశ, సినిమా: బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న హీరో నితిన్.. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు క్రేజీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఓ సినిమాపై నితిన్ బర్త్‌డే స్పెషల్‌గా నేడు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘ఎల్లప్పుడూ ఎనర్జిటిగ్‌గా ఉండే యాక్టర్ నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. టీమ్ ప్రొడక్షన్ No43 మా ప్రయాణం త్వరలోనే ప్రారంభం కానుంది. వేచి ఉండండి... ముందు ముందు ఎన్నో గొప్ప అప్డేట్స్ ఉన్నాయి’ అని తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. నితిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంతో అయిన మంచి కమ్ బ్యాక్ ఇవ్వూ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంతో ఓ కొత్త డైరెక్టర్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.






