ఆ హీరోయిన్ తండ్రిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉగ్రవాదులు.. ఆయన డెడ్ బాడీ మొదట అక్కడ చూశామని కన్నీరు పెట్టుకున్న నటి..

by Sujitha Rachapalli |

భారత్-పాక్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. బార్డర్ ప్రాంతాల్లో ఇరు దేశాలు శాంతిని కొనసాగిస్తున్నాయి. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిమ్రత్ కౌర్ తన తండ్రిని ఉగ్రవాదులు ఎలా హతమార్చారో ఓ ఇంటర్వ్యూలో

ఆ హీరోయిన్ తండ్రిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉగ్రవాదులు.. ఆయన డెడ్ బాడీ మొదట అక్కడ చూశామని కన్నీరు పెట్టుకున్న నటి..
X

దిశ, ఫీచర్స్ : భారత్-పాక్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. బార్డర్ ప్రాంతాల్లో ఇరు దేశాలు శాంతిని కొనసాగిస్తున్నాయి. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిమ్రత్ కౌర్ తన తండ్రిని ఉగ్రవాదులు ఎలా హతమార్చారో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నిమ్రత్ తండ్రి మేజర్ భూపేందర్ సింగ్.. 1994లో జమ్మూ కాశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులచే కిడ్నాప్‌ చేయబడ్డాడని.. ఆ తర్వాత హత్యకు గురయ్యాడని వివరించింది.

మేజర్ భూపేందర్ సింగ్ భారత సైన్యంలో ఇంజనీర్‌గా పనిచేస్తూ.. జమ్మూ కాశ్మీర్‌లోని వెరినాగ్ ప్రాంతంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తుండేవాడు. వెరినాగ్, జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో జవహర్ టన్నెల్ తర్వాత వచ్చే మొదటి లోయ. కాగా ఆ సమయంలో కాశ్మీర్ ఫ్యామిలీ స్టేషన్‌గా పరిగణించబడక పోవడంతో.. తల్లి అవినాష్ కౌర్, చెల్లెలు రూబినా సింగ్‌, నిమ్రత్ పంజాబ్‌లోని పటియాలాలోనే ఉండేవారు.

అయితే 1994 జనవరిలో వింటర్ హాలీడేస్ రావడంతో నిమ్రత్ కౌర్ తన కుటుంబంతో కలిసి తన తండ్రి దగ్గరకు వెరినాగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంలో మేజర్ భూపేందర్ సింగ్ 99 రోడ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్నారు. ఖన్నాబల్-పహల్గాం రోడ్డుపై ఐదు బెయిలీ బ్రిడ్జిల నిర్మాణానికి బాధ్యత వహించారు. ఈ నిర్మాణం 'ప్రాజెక్ట్ బీకన్'లో భాగం. కాగా జనవరి 17, 1994న, మేజర్ భూపేందర్ సింగ్ ఇద్దరు అధికారులు, 13 మంది సైనికులతో కలిసి నిర్మాణ స్థలాలను పరిశీలించడానికి వెళుతుండగా.. అక్కర్ గ్రామంలో ఉగ్రవాదులు వారిపై దాడి చేశారు. ఈ దాడిలో దగ్గరి నుంచి కాల్పులు జరిగినప్పటికీ, మేజర్ సింగ్ తన సైనికులను త్వరగా సమన్వయం చేసి.. ఉగ్రవాదులతో క్రాస్‌ఫైర్‌లో దాడిని విజయవంతంగా తిప్పికొట్టారు. అయితే ఈ ఘటనలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మేజర్ సింగ్‌ను కిడ్నాప్ చేశారు.

ఉగ్రవాదులు మేజర్ భూపేందర్ సింగ్‌ను ఏడు రోజుల పాటు బందీగా ఉంచారు. భారత ఖైదీలుగా ఉన్న కొంతమంది ఉగ్రవాదుల విడుదలను డిమాండ్ చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఆమోదించలేదు. మేజర్ సింగ్ కూడా ఈ డిమాండ్లను నిరాకరించారు. దేశభక్తి, విధి నిర్వహణకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో జనవరి 23, 1994న, ఉగ్రవాదులు మేజర్ సింగ్‌ను హత్య చేశారు. కాగా నిమ్రత్ కౌర్, ఆమె కుటుంబం ఈ వార్త తెలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వారు మేజర్ సింగ్ శరీరాన్ని మొదటిసారి చూశారు. ఈ ఘటన నిమ్రత్ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయగా.. ఆ సమయంలో నిమ్రత్ వయస్సు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే.

Next Story