నిఖిల్ 'స్వయంభు'.. మామూలు రన్ టైమ్ కాదుగా?

by Pulgam srinivas |

స్వయంభు మూవీ 2 గంటల 51 నిమిషాల భారీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

నిఖిల్ స్వయంభు.. మామూలు రన్ టైమ్ కాదుగా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సంయుక్తా మీనన్, నభా నటేష్ ఇందులో హీరోయిన్లుగా కనిపించనుండగా, భారత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మే 22న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ ఏకంగా 2 గంటల 51 నిమిషాల భారీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ నిడివితో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే భారీ నిడివితో ప్రేక్షకులను అలరించాలంటే కంటెంట్ బలంగా ఉండటం చాలా ముఖ్యం. కథ, కథనం బలంగా ఉంటే ఇలాంటి పెద్ద రన్‌టైమ్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. లేకపోతే అదే అంశం సినిమాకు నష్టాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story