Nikhil Siddhartha: నిఖిల్ ప్రైవేట్ వీడియోలు లీక్.. స్పందించి క్లారిటీ ఇచ్చిన హీరో.. ఏమన్నారంటే?

by Hamsa |
Nikhil Siddhartha: నిఖిల్ ప్రైవేట్ వీడియోలు లీక్.. స్పందించి క్లారిటీ ఇచ్చిన హీరో.. ఏమన్నారంటే?
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి రాజ్ తరుణ్(Raj Tarun) మాజీ ప్రియురాలు లావణ్య సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రాజ్ తరుణ్‌ తనను ప్రేమించి మోసం చేశాడని సంచలన కామెంట్స్ చేసి దుమారం రేపింది. దీంతో ఆయనపై కేసు నమోదు కావడంతో అరెస్ట్ కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు కోర్టు ఊరనిచ్చింది. అయినప్పటికీ లావణ్య మాత్రం ఈ కేసులో నిత్యం పలువురి పేర్లను తీసుకువస్తే నెట్టింట రచ్చ చేస్తోంది. ఇక ఇటీవల ఈ వ్యవహారంలో మస్తాన్ సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేసిన సమయంలో కొన్ని హార్ట్ డిస్క్‌లకు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో టాలీవుడ్ హీరో నిఖిల్(Nikhil) ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా, నిఖిల్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి నా పేరు ప్రస్తావిస్తోంది. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ అబద్ధాలు నమ్మకండి. ఆ వీడియోలు ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీలోనివి.

నా కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపిస్తున్నారు. ఇందులోని నిజానిజాలు పోలీసులకు కూడా తెలుసు. దయచేసి నాపై తప్పుడు వార్తలు సృష్టించకండి’’ అని చెప్పుకొచ్చారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’(Swayambhu)లో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి(Bharat Krishnamachari) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్(Samyukta Menon),నభా నటేష్(Nabha Natesh) హీరోయిన్లగా నటిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Next Story

Most Viewed