- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వయంభు అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. నేనే దగ్గరుండి చూసుకుంటున్నా అంటూ పోస్ట్
స్వయంభు' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి వేగంతో సాగుతున్నాయంటూ విడుదలపై అప్డేడ్ ఇచ్చాడు హీరో నిఖిల్.

దిశ, సినిమా: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్, ఠాకూర్ మధు ప్రజెంట్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చెయ్యగా.. కొన్ని అనివార్య కారణాల చేత వాయిదా వేశారు. మళ్లీ ఇప్పటి వరకు విడుదల డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా హీరో నిఖిల్ ఓ వీడియో షేర్ చేస్తూ స్వయంభు అప్డేట్ ఇచ్చాడు. ‘'స్వయంభు' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి వేగంతో సాగుతున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ DOP సెంథిల్‌కుమార్‌తోనూ, చిత్ర బృందంతోనూ కలిసి నేను స్వయంగా VFX స్టూడియోలను సందర్శించాను.. 2700 VFX షాట్లు, 750 మంది CG కళాకారులు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. అత్యున్నత నాణ్యతతో కూడిన అవుట్‌పుట్‌ను అందించడమే మా లక్ష్యం. విడుదల తేదీ లోడ్ అవుతుంది.. మేము ప్రతిదీ పరిపూర్ణంగా పూర్తి చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.






