రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక మాజీ భర్త చైతన్య.. అమ్మాయి ఎవరంటే?

by Hamsa |
రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక మాజీ భర్త చైతన్య.. అమ్మాయి ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక, జొన్నగడ్డ చైతన్యలు 2020లో డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అలాగే ఆ తర్వాత ఏమి మనస్పర్థలు వచ్చాయో తెలియదు కానీ ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఇదే విషయాన్ని నిహారిక అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఇక విడాకుల తర్వాత వీరిద్దరూ ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. నిహారిక ఇటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తుంది.

తాజాగా, నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. జొన్నలగడ్డ చైతన్య రిలేటివ్స్‌కి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. అమ్మాయి వాళ్ల నాన్న కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్.. సెలబ్రిటీకి మించిన గౌరవం ఉందట. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ నిహారికకు బిగ్ షాక్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిహారిక లేనిదే చైతన్య బతకలేడు అనుకున్న వాళ్ళకి ఆయన ఘాటైన సమాధానం ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆయనను పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ విషయం నీహారికకు కూడా తెలుసని.. ఆమె కూడా ఆయన రెండో పెళ్లి పట్ల హ్యాపీగానే ఉందని కూడా టాక్.

Read More: మెగాస్టార్ గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో శివరాజ్ కుమార్Next Story

Most Viewed