- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే ఈ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నాం.. నిహారిక కామెంట్స్‌తో రాకాస చిత్రంపై మరింత
by Chukka Sudharani |
రాకాస్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందంటూ చెప్పుకొచ్చింది నిర్మాత నిహారిక కొణిదెల.

X
దిశ, సినిమా: నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న రెండో చిత్రం ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించగా.. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రం నేడు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ మ్యాడ్ నెస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక మాట్లాడుతూ.. ‘‘రాకాస’ కోసం షూటింగ్ చేసిన దాని కంటే ప్రమోషన్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టాం. మేం మంచి సినిమాని తీశాం. మేం తీసిన మూవీని జనాల వరకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ఈ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నాం. గ్లింప్స్ నుంచే ‘రాకాస’ మీద భారీ హైప్ ఏర్పడింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా, ఎంటర్టైన్ అయ్యేలా మా ‘రాకాస’ ఉంటుంది. మా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. పూర్తిగా హారర్, థ్రిల్లర్ అని కాకుండా.. కామెడీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల అంశాలతో ఉంటుంది. ‘రాకాస’లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’ అని అన్నారు.
Next Story






