Niharika: ఈ లుక్ చూస్తే చూపు తిప్పుకోలేరు

by Pulgam srinivas |

బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న నిహారిక

Niharika: ఈ లుక్ చూస్తే చూపు తిప్పుకోలేరు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నిహారిక ఒకరు. మొదట షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన ఈమె ‘ఒక మనసు’ అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యింది.




ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినప్పటికీ ఆమెకు పెద్ద విజయాలు దక్కలేదు. దాంతో ప్రస్తుతం ఈమె నిర్మాతగా కొనసాగుతోంది. కొంతకాలం క్రితమే ‘కమిటీ కుర్రాళ్లు’ అనే చిత్రాన్ని నిర్మించి మంచి విజయంతో పాటు ప్రశంసలను అందుకున్న ఈమె, తాజాగా 'రాకాస' చిత్రాన్ని నిర్మించింది.




ఈ మూవీని ఏప్రిల్ 3న విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నిహారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న ఈమె, మరికొంతకాలంలోనే హీరోయిన్గా మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది.




ఈ మధ్యకాలంలో చాలా కథలు విన్నట్లు, అందులో కొన్ని నచ్చినట్లు పేర్కొంటూ వచ్చే సంవత్సరం హీరోయిన్గా రీ-ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నట్లు ధృవీకరించింది. సినిమా పనులతో ఎంత బిజీగా ఉన్నా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తరచుగా పోస్ట్ చేస్తూ వస్తోంది.




తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ స్టైలిష్‌గా నిలబడి కొంటె చూపులతో ఆకట్టుకుంటోంది. నలుపు రంగు లాంగ్ డ్రెస్సు ధరించి, గోల్డ్ కలర్ ఇయర్‌రింగ్స్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story