- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్గా రీ ఎంట్రీ ఇవ్వనున్న నిహారిక
2027లో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నిహారిక తాజాగా తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: నాగబాబు ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక ‘ఒక మనసు’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో నిర్మాతగా కెరీర్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌ను నిర్మించగా, అది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
తాజాగా నిహారిక ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో సంగీత శోభన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీని ఏప్రిల్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ… ఇప్పటికే సంగీత్ శోభన్‌తో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ నిర్మించానని, ఇప్పుడు ఆయనతో ‘రాకాస’ మూవీ చేశానని తెలిపింది. ఈ చిత్రం హర్రర్ కామెడీ ప్లస్ ఫాంటసీ జానర్‌లో రూపొందిందని, ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే ఈ మధ్యకాలంలో కుటుంబంతో కలిసి చూసే విధంగా సినిమాలు తక్కువగా వస్తున్నాయని, అయితే ఈ చిత్రాన్ని మాత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా రూపొందించామని చెప్పుకొచ్చింది.
'నిహారిక'కి మీరు ఇప్పటివరకు హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేశారు, కానీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నారు. మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఎదురయింది. దీనికి నిహారిక స్పందిస్తూ… తాను మళ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నానని తెలిపింది. గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో చాలా కథలు విన్నానని, అందులో కొన్ని బాగా నచ్చాయని చెప్పింది. 2027లో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది.






