Niharika: విడాకుల గురించి ఓపెన్ అయిన మెగా డాటర్.. విషయం తెలిసాక నాన్న అలా అన్నారు

by Pulgam srinivas |   (  Updated:2026-03-21 08:55:58  IST  )

నిహారిక మాట్లాడుతూ... విడాకులు తీసుకోవాలి అని నిర్ణయానికి వచ్చాక మొదట మా నాన్నగారికి విషయం చెప్పాను, ఆయన కూడా నన్ను అర్థం చేసుకున్నట్లు ఈమె చెప్పుకొచ్చింది.

Niharika: విడాకుల గురించి ఓపెన్ అయిన మెగా డాటర్.. విషయం తెలిసాక నాన్న అలా అన్నారు
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే తన తండ్రి అయిన నాగబాబుతో కలిసి కొన్ని టీవీ షోలకు కూడా అటెండ్ అయి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఈ ముద్దుగుమ్మ నాగశౌర్య హీరోగా నటించిన 'ఒక మనసు' చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాలలో ఈమె నటించినా కూడా వాటిలో ఏ సినిమా ద్వారా కూడా ఈమెకు విజయం దక్కలేదు, అలాగే నటిగా కూడా గొప్ప ప్రశంసలు అందలేదు. నటిగా సక్సెస్ కాలేకపోయినా ఈ బ్యూటీ నిర్మాతగా మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకుంది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఈమె కొంతకాలం క్రితం కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను పొందింది. తాజాగా నిహారిక, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈ సినిమా గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈ నటి ఓపెన్ అయింది. ముఖ్యంగా తన పెళ్లి, విడాకుల గురించి చెప్పుకొచ్చింది. జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయిని నిహారిక పెళ్లి చేసుకుంది.

పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో ఎంతోమంది వ్యక్తుల మధ్య వీరి వివాహం రంగ రంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వీరు దాదాపు ఒక ఏడాది పాటు కలిసి ఉన్నారు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోయారు. నిహారిక విడాకులు తీసుకొని ఇప్పటికే మూడు సంవత్సరాల వరకు అవుతుంది. తాజాగా ఈమెకు మీరు విడాకుల నిర్ణయం తీసుకున్నాక మొదట ఎవరికి చెప్పారు అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఈమె... నేను ఆ నిర్ణయం తీసుకున్నాక మా నాన్నగారికి చెప్పాను, ఆయన విషయం విని సైలెంట్ అయ్యారు. అలాగే పెళ్లి తర్వాత వారు నన్ను ఎంతో గమనించారు, నేను ఆనందంగా లేననే విషయం వారికి తెలుసు. దానితో మా నాన్న... నువ్వు ఇబ్బందిగా జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు, విడాకులు తీసుకొని సంతోషంగా ఉండు అన్నారు. ఆ తర్వాత నేను, నా భర్త ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని నిహారిక చెప్పుకొచ్చింది.

Tamannaah: సైడ్ యాంగిల్‌లో నడుమందాలు హైలైట్

Next Story