Niharika: అంజి సినిమా నుండి నన్ను అందుకే తీసేసారు.

by Pulgam srinivas |

నిహారిక మాట్లాడుతూ... అంజి సినిమాలో మొదట నన్ను తీసుకున్నారు, కానీ ఆ తర్వాత అంత చిన్న పాప అవసరం లేదని నా పాత్రను తీసేసినట్లు ఈ నటి చెప్పుకొచ్చింది.

Niharika: అంజి సినిమా నుండి నన్ను అందుకే తీసేసారు.
X

దిశ, వెబ్ డెస్క్: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటిగా గుర్తింపును సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ముందుకు సాగుతోంది. తాజాగా ఈమె ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈమెకు — మీరు చాలా చిన్న వయసులో ఉన్న సమయంలో చిరంజీవి హీరోగా నటించిన ‘అంజి’ చిత్రంలో ఒక పాత్రలో నటించారు కదా? ఆ తర్వాత ఎందుకు మీ పాత్రను చిత్రం నుండి తీసేశారు? — అనే ప్రశ్న ఎదురైంది. దానికి నిహారిక స్పందిస్తూ… ‘అంజి’ సినిమాలో చాలామంది చిన్న పిల్లలు ఉంటారు.

అందులో నేను ఒక పాత్ర చేశాను. నాపై ఐదు నుంచి ఏడు రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత సినిమా కథ మారడం వల్ల అంత చిన్న పాప సినిమాలో ఉండకూడదు, కాస్త పెద్దవాళ్లు అయితే బెటర్ అనే నిర్ణయానికి మూవీ బృందం వచ్చింది. నాకు అప్పుడు సరిగ్గా మాటలు కూడా రావు. దాంతో నా పాత్రను తీసేసి వేరే వాళ్లను పెట్టుకున్నారు. ఇక నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అనేకసార్లు కనీసం డిలీట్ చేసిన ఆ ఫుటేజ్ అయినా ఇవ్వండి సార్ అని అడిగాను. కానీ అది ఎక్కడా దొరకలేదు అని నిహారిక సమాధానం ఇచ్చింది. ‘అంజి’ చిత్రంలో నిహారిక తండ్రి నాగబాబు కీలక పాత్రలో నటించారు. ఇకపోతే చిరంజీవి హీరోగా రూపొందిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నిహారిక ఓ చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Next Story