- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ గాయాల వార్తపై లైవ్‌లో నిహారిక షాక్.
రామ్ చరణ్‌కు స్వల్ప గాయం.. లైవ్‌లోనే షాక్ అయిన నిహారిక

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ చరణ్‌కు స్వల్ప గాయాలు అయినట్లు ఓ వార్త బయటకు రావడం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. ఇక రామ్ చరణ్ సోదరి నిహారిక తాజాగా ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీని ఏప్రిల్ 3న విడుదల చేయనున్న నేపథ్యంలో ఆమె పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒక విలేకరి ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ గారికి యాక్సిడెంట్ జరిగిందట కదా? అని ప్రశ్నించగా, నిహారిక ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
రామ్ చరణ్ గురించి ఇలా అడగడంతో వెంటనే స్పందించిన ఆమె, “పర్లేదు కదా?” అని ఆందోళనగా ప్రశ్నించింది. అదే సమయంలో, “మీరు ఎందుకు ఇలా షాకింగ్ న్యూస్ సడన్‌గా చెబుతున్నారు?” అని నిహారిక ప్రశ్నించగా, విలేకరులు “మీకు తెలుసు అనుకున్నాం” అని సమాధానం ఇచ్చారు. దానికి నిహారిక, “నాకు తెలియదు సార్… నేను ఫోన్ వాడలేదు, అందుకే ఎలాంటి న్యూస్ తెలియలేదు” అని స్పందించింది. రామ్ చరణ్‌కు యాక్సిడెంట్ జరిగిందని వినగానే నిహారిక చూపించిన ఆందోళన చూసిన అభిమానులు, అన్నపై ఈమెకు ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా కనిపించింది అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్యం బాగున్నట్లు, షూటింగ్ కూడా కొనసాగిస్తున్నారని సమాచారం.






