మన హద్దుల్లో మనం ఉంటే సరిపోతుంది.. కాస్టింగ్ కౌచ్‌పై నిహారిక ఆసక్తికర కామెంట్స్

by Chukka Sudharani |

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నిహారిక ఎన్ఎమ్.. ఇప్పుడు ‘మిత్ర మండలి’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది.

మన హద్దుల్లో మనం ఉంటే సరిపోతుంది.. కాస్టింగ్ కౌచ్‌పై నిహారిక ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నిహారిక ఎన్ఎమ్.. ఇప్పుడు ‘మిత్ర మండలి’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ మూవీతో కొత్త దర్శకుడు విజయేందర్ ఎస్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అక్టోబర్ 16న ‘మిత్ర మండలి’ రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో చిత్ర పరిశ్రమ గురించి ఏవోవో మాట్లాడుకుంటూ ఉంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు’ అని తెలిపింది. అలాగే పాత్రలపై మాట్లాడుతూ.. ‘తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు. అదే నేను పెట్టుకున్న కండీషన్’ అని తెలిపింది.

Next Story