Alcohol: అల్లరి నరేష్ సినిమాలో నిహారిక.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఆకట్టుకుంటోన్న లుక్

by Chukka Sudharani |   (  Updated:2025-07-04 15:35:27  IST  )

క్రేజీ హీరో అల్లరి నరేష్ (Allari Naresh) ప్రస్తుతం రూట్ మార్చి.. డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల‌ను అల‌రిస్తున్నాడు.

Alcohol: అల్లరి నరేష్ సినిమాలో నిహారిక.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఆకట్టుకుంటోన్న లుక్
X

దిశ, సినిమా: క్రేజీ హీరో అల్లరి నరేష్ (Allari Naresh) ప్రస్తుతం రూట్ మార్చి.. డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల‌ను అల‌రిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన మెహర్ తేజ్ (Meher Tej) ద‌ర్శక‌త్వంలో ‘ఆల్కహాల్’ చిత్రంలో న‌టిస్తున్నారు. అల్లరి న‌రేష్ కెరీర్‌లో 63వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్‌గా అల్లరి నరేష్ బ‌ర్త్ డే కావడంతో.. ఆ సంద‌ర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో ఫుల్ డ్రింకర్‌గా అన్నట్లుగా హింట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు ఇదే జోష్‌తో ఈ సినిమాలో మరో క్యారెక్టర్‌ను రివీల్ చేశారు చిత్ర బృందం. ఇందులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్‌ఎమ్ (Niharika Nm) నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రోజు నిహారిక పుట్టిన రోజు కావడంతో.. ఈ సందర్భంగా ఆల్కహాల్ టీమ్ నిహారికకు విష్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో.. ఈ బ్యూటీ దీపం వెలిగిస్తూ పదహారణాల తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story
null