Niharika Konidela: ‘ఎట్టకేలకు నేను తహతహలాడుతోన్న దాన్ని పొందడానికి టైం వచ్చింది’.. నిహారిక

by Kodari Anjali |   (  Updated:2025-03-10 12:49:19  IST  )

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Niharika Konidela: ‘ఎట్టకేలకు నేను తహతహలాడుతోన్న దాన్ని పొందడానికి టైం వచ్చింది’.. నిహారిక
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ బుల్లితెరపై ఢీ జూనియర్స్‌లో యాంకరింగ్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత నిహారికకు నాగ శౌర్య సరసన ఒక మనసు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోకున్న నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

తర్వాత నాన్న నాగబాబుతో కలిసి నాన్నకూచి వెబ్ సిరీస్‌లో కూడా నటించి.. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అవకాయ్, డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌ల్లో కూడా తన అద్భుతమైన నటనను కనబర్చింది. అంతేకాకుండా.. సూర్యాకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో కూడా అవకాశం కొట్టేసి.. నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం నిర్మాతగా తన టాలెంట్ బయటపెడుతోంది.

నిర్మాతగా మొదటి సినిమాగా కమిటీ కుర్రాళ్లు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది నిహారిక. ఈ మూవీ జనాల అంచనాలకు రీచ్ అవ్వడంతో నిహారిక నిర్మాతగా మంచి పేరు సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఇకపోతే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒకటి రాసుకొచ్చింది. ‘‘ఎట్టకేలకు నేను 3 రోజులుగా తహతహలాడుతున్న ఒక కప్పు కాఫీని పొందడానికి సమయం వచ్చింది. నా చిన్న హృదయం సంతోషంగా ఉంది. పి.ఎస్. ఈ చీర పేటెంట్ పొందింది’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం మెగా డాటర్ ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.


Read Also..

‘నా మార్గదర్శక నక్షత్రాలుగా ఉన్నందుకు ధన్యవాదాలు’.. ఫొటోలు పంచుకుంటూ సూపర్‌స్టార్ సతీమణి ఆసక్తికర పోస్ట్


Read Also..

ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఆదే తొలిసారి.. ఏఐ టెక్నాలజీతో సాంగ్.. ఎందులోనంటే!

Next Story