- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టేజ్ పైనే డ్యాన్స్ ఇరగదీసిన నిహారిక
తాను నిర్మిస్తున్న రకాసా సినిమా ప్రమోషన్స్ లో డాన్స్ చేసి అలరించారు నిహారిక కొణిదెల.

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల ( Niharika Konidela) జీ స్టూడియోస్ సమర్పణలో రకాసా సినిమా ( Rakasa Movie) వస్తున్న సంగతి తెలిసిందే. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఉమేష్ కుమార్ బన్సాల్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మానస శర్మ రూపొందిస్తున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ మూడవ తేదీన ఈ మూవీ చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
ఈ క్రమంలోనే నిర్మాతగా వ్యవహరిస్తున్న నిహారిక కొణిదెల స్టేజ్ పైన డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. రకాసా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా నిహారిక స్టెప్పులు వేశారు. హీరో సంగీత శోభన్ తో కలిసి ఈ డ్యాన్స్ చేయడం గమనార్హం. దీంతో వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నిహారికలో పాత ఎనర్జీ కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.






