- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నతో సినిమాపై నిహారిక అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. అత్యంత విశిష్ట అతిథి రాక ఖాయం అంటూ పోస్ట్
అన్న వరుణ్ తేజ్‌తో సినిమాపై నిహారిక కొణిదెల అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది.

దిశ, సినిమా: హీరోయిన్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన మెగాడాటర్ నిహారిక కొణిదెల.. హీరోయిన్‌గా కంటే నిర్మాత గుర్తింపు తెచ్చుకుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. మొదటి చిత్రంతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక.. ఇప్పుడు తన రెండొవ చిత్రంగా ‘రాకాస’ నిర్మిస్తుంది. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ప్రజెంట్ ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నా నిహారిక తన బ్యానర్‌పై మూడో చిత్రాన్ని తాజాగా ప్రకటించింది.
ఇందులో ఓ ట్విస్ట్ ఏంటంటే.. తన అన్నయ్య వరుణ్ తేజ్ కొణిదెల హీరోగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. అయితే.. అన్నాచెల్లిల కలయికలో మూవీ రాబోతున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తుండగా.. ఫైనల్‌గా దానికి తెర దింపుతూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది నిహారిక. ఈ మేరకు తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ అఫీషియల్ అకౌంట్ వేదికగా.. ‘ఫ్రేమ్‌లో భద్రపరచుకోదగ్గ అద్భుత కలయిక.. విజయకేతనం ఎగురుతోంది.. పూర్తిగా శక్తితో నిండిన పూజా కార్యక్రమంతో Pep3 నుండి రేపు మొదటి అడుగు..! VT16 కోసం ఒక అత్యంత విశిష్ట అతిథి రాక ఖాయం... వేచి చూడండి’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో వాలీ బాల్ ప్లేయర్‌గా కనిపించన్నాడు.






