- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బన్నీతో లవ్ స్టోరీ, మహేశ్‌తో అలాంటి సినిమా చేస్తానంటున్న మెగా డాటర్
మెగాడాటర్ నిహారిక ప్రస్తుతం తండ్రి నాగబాబు బాటలోనే నడుస్తోంది. నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగాడాటర్ నిహారిక ప్రస్తుతం తండ్రి నాగబాబు బాటలోనే నడుస్తోంది. నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తోంది.యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరవాత నటిగా హీరోయిన్‌గా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఆశించినమేర విజయం సాధించలేదు. ఈ క్రమంలోనే నిహారిక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. వైవాహిక జీవితం కలిసిరాకపోవడంతో భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటోంది.
ఇక పెళ్లి తరవాత నిహారిక సినిమా నిర్మాణం వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. సొంతంగా ఓ బ్యానర్ ఏర్పాటు చేసి చిన్న సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమా చేస్తోంది. అయితే తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరోలతో అవకాశం వస్తే ఎవరితో ఏ జోనర్ సినిమా చేస్తారని ప్రశ్నించగా అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ నిర్మిస్తానని చెప్పింది. అంతే కాకుండా మహేశ్ బాబుతో మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా నిర్మిస్తానని చెప్పింది. ఇక డైరెక్షన్ చేసే అవకాశం వస్తే తన సోదరుడు రామ్ చరణ్ తోనే మొదటి సినిమా చేస్తానని స్పష్టం చేసింది. మని నిహారిక కలలు నిజం అవుతాయో లేదో చూడాలి.






