‘ఇది ఎప్పటికీ ముగియని యుద్ధం’.. ధన్యవాదాలు చెప్తూ మెగా డాటర్ పోస్ట్

by Anjali |
‘ఇది ఎప్పటికీ ముగియని యుద్ధం’.. ధన్యవాదాలు చెప్తూ మెగా డాటర్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Mega daughter Niharika Konidela)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ బుల్లితెరపై ఢీ జూనియర్స్‌(Dhee Juniors)లో యాంకరింగ్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఈమెకు హీరో నాగ శౌర్య(Naga Shaurya) సరసన ‘ఒక మనసు’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోకున్న నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

తర్వాత నాన్న నాగబాబు(Naga Babu)తో కలిసి నాన్నకూచి(Nannakuchi) వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అవకాయ్(Avakay), డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌ల్లో కూడా తన అద్భుతమైన నటనను కనబర్చింది. అంతేకాకుండా సూర్యాకాంతం(Suryakantam), హ్యాపీ వెడ్డింగ్ (Happy wedding)వంటి సినిమాల్లో కూడా అవకాశం కొట్టేసి.. నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం నిర్మాతగా తన టాలెంట్ బయటపెడుతోంది.

నిర్మాతగా మొదటి సినిమాగా కమిటీ కుర్రాళ్లు (Committee guys) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది నిహారిక. ఈ సినిమా జనాల అంచనాలకు రీచ్ అవ్వడంతో నిహారిక నిర్మాతగా మంచి పేరు సంపాదించుకుంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చిన్నప్పటి నుంచి సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించింది. సినిమాలోని సన్నివేశాలు జనాలకు కన్నీళ్లు తెప్పించాయి.

ఇకపోతే మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నేను నా ఫిట్‌నెస్ ఎప్పటికీ ముగియని యుద్ధం.. ఆంటోని ఫిట్‌నెస్ జిమ్ ఎల్లప్పుడు నన్ను నెట్టివేస్తున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ నిహారిక పోస్ట్‌లో జిమ్ చేస్తోన్న వీడియోకు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ మెగా డాటర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story