- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Niharika: బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడ్డ నిహారిక.. షాకింగ్ పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిందిగా!
బాలీవుడ్ ప్రముఖ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ తో ఎంతో క్లోజ్‌గా ఉన్న కొన్ని ఫొటోలను నిహారిక సోషల్ మీడియాలో పంచుకున్నారు.

దిశ, సినిమా: బుల్లితెర ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక ఎన్‌ఎమ్ తన డ్యాన్స్ స్టెప్పులతో అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఫుల్ ఫేమ్ రాబట్టుకున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేసిన ఆమె.. నటనపై ఆసక్తిలో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చారు. తెలుగులో ప్రియదర్శి సరసన ‘మిత్రమండలి’ సినిమాలో నటించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో అమ్మడుకి అవకాశాలు కూడా కరువయ్యాయి. ఈనేపథ్యంలోనే.. తాజాగా, నిహారిక సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ద్వారా వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ తో ఎంతో క్లోజ్‌గా ఉన్న కొన్ని ఫొటోలను నిహారిక సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక ఫొటోలో నిహారికను రాఘవ్ వెనుక నుండి గట్టిగా హగ్ చేసుకుని కనిపించగా.. మరో ఫొటోలో ఇద్దరూ కెమెరాకు నవ్వుతూ పోజులిచ్చారు.
అయితే, అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఫొటోల్లో నిహారిక తన చేతి వేలికి ఉన్న ఒక ఉంగరాన్ని చూపిస్తూ ప్రత్యేకంగా పోజ్ ఇవ్వడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అలాగే రాఘవ్ కూడా తన ఇన్‌స్టా స్టోరీలో రెడ్ హార్ట్ సింబల్‌తో పాటు స్టార్ గుర్తును జత చేసి ఈ ఫొటోలను షేర్ చేయడం విశేషం. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, అంతేకాకుండా సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. ఈ ఫొటోలు చూసిన కొందరు అభిమానులు.. వీరిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారని.. రాఘవ‌్‌ను ఉద్దేశిస్తూ మొత్తానికి వదిన దొరికేసిందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే దీనిని కొందరు ఇది నిజమైన ప్రేమే అని నమ్ముతుండగా.. మరికొందరు మాత్రం ఇదంతా కేవలం కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో భాగమే అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ వైరల్ ఫొటోలపై అటు నిహారిక కానీ, ఇటు రాఘవ్ జుయల్ కానీ అధికారికంగా స్పందిస్తేనే అసలు నిజం ఏంటనేది పూర్తిగా తేలనుంది.






