- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nisha Aggarwal : అదిరిపోయే లుక్‌లో కాజల్ అగర్వాల్ చెల్లెలు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) చెల్లెలు నిషా అగర్వాల్ (Nisha Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) చెల్లెలు నిషా అగర్వాల్ (Nisha Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ.. మంచి గుర్తింపే సంపాదించుకుంది. ఏమైంది ఈ వేలా (Ēmaindi e vela), సోలో (Solo), ఇష్టా (Ishta), సుకుమారుడు (Sukumar), సరదాగ అమ్మాయితో (Saradaga ammaytho ), భయ్యా భయ్యా (Bhaiya Bhaiya), దాయాదులు (Dayadulu) వంటి తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక నిషా అగర్వాల్ 2013 లో కరణ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహనంతరం ఈ బ్యూటీ పూర్తిగా సినిమాలకు దూరం అయింది. కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భర్త, పిల్లల ఫొటోలు కూడా పంచుకుంటుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన స్వీట్ మెమోరీస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. తాజాగా నిషా అగర్వాల్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింద. కోట్ మాదిరి స్టైలిష్ డ్రెస్ ధరించి.. మంచి స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫొటోలకు నిషా ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘ జనాదరణ పొందిన డిమాండ్ ప్రకారం ఈ లుక్‌ను విడదీయండి’’. అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






