- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harihara Veeramallu: ది సిజ్లింగ్ తారా గ్లామర్ అండ్ ఎనర్జీతో రావడానికి సిద్ధంగా ఉంది.. కలర్ ఫుల్‌గా నిధి అగర్వాల్ పోస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 12 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో పాట ‘తారతార’ రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాట రిలీజ్ టైమ్ అనౌన్స్ చూస్తూ నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
‘ది సిజ్లింగ్ ‘తారతార’ ఫుల్ ఎనర్జీ అండ్ గ్లామర్ విజృంభించడానికి సిద్ధంగా ఉంది! హరిహరవీరమల్లు 4వ సింగిల్ రేపు ఉదయం 10:20 గంటలకు రాబోతుంది. జూన్ 12, 2025 నుండి ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్లలో హరిహర వీరమల్లు సందడి చేయనుంది’ అంటూ షేర్ చేసిన పోస్టర్ ప్రజెంట్ నెట్టింట ఆకట్టుకుంటోంది. కాగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలె ఎ. దయాకర్ రావు దీనిని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా పొన్నాడ, బాబీ డియోల్, సత్య రాజ్, నర్గీస్ ఫక్రీ, విక్రమ్ జీత్ విర్క్, నాజర్, నోరా ఫతేహి, అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు.






