Harihara Veeramallu: ఇదొక ఎమోషనల్ జర్నీ: నిధి అగర్వాల్

by Chukka Sudharani |   (  Updated:2025-05-22 15:56:36  IST  )

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ( Nidhi Agarwal) త్వరలో ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) చత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Harihara Veeramallu: ఇదొక ఎమోషనల్ జర్నీ: నిధి అగర్వాల్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ( Nidhi Agarwal) త్వరలో ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) చత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా.. క్రిష్, జ్యోతికృష్ణలు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ జూన్ 12 థియేటర్స్‌లోకి రానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఈ సందర్భంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre-release event) నిర్వహించగా.. ఈ సినిమాపై హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘‘హరిహర వీరమల్లు’ చిత్రం నాకు ఒక ఎమోషనల్ జర్నీలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ బిగింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు ఎంతో మందితో షూట్ చేశాము. అందుకే ఈ మూవీ ఎమోషనల్ జర్నీ, ఎమోషనల్ ఫీలింగ్. అండ్ మీ అందరికి ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను పవన్ కల్యాణ్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్‌ను. నిజంగా ఆయనతో నటించే అదృష్టం నాకు దొరడం చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ రత్నం సర్.. మీలాంటి హార్డ్ వర్కింగ్ వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. జ్యోతి సర్ కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఈ మోస్ట్ స్పెషల్ ఫిలిమ్ ఎప్పటికి నా హృదయానికి దగ్గరగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story