Nidhi Agarwal: స్టార్టింగ్‌లో తీవ్రమైన ట్రోల్స్.ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

by Chukka Sudharani |   (  Updated:2025-07-15 14:49:44  IST  )

హీరోయిన్ నిధి అగర్వాల్.. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’, పవన్ కల్యాన్ ‘హరిహర వీరమల్లు’తో బిజీగా ఉంది.

Nidhi Agarwal: స్టార్టింగ్‌లో తీవ్రమైన ట్రోల్స్.ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
X

దిశ, సినిమా: హీరోయిన్ నిధి అగర్వాల్.. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’, పవన్ కల్యాన్ ‘హరిహర వీరమల్లు’తో బిజీగా ఉంది. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జులై 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ట్రోల్స్‌పై వివరణ ఇచ్చింది. ‘హరిహర వీరమల్లు స్టార్టింగ్‌లో ఎన్నో కామెంట్స్, ట్రోల్స్ వచ్చాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక వాటన్నిటికి చెక్ పడింది.

ఈ సినిమా విజయంపై ఏఎం రత్నం ఎంతో ధీమాగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ రాజీ పడకుండా వీరమల్లుని నిర్మించారు. మనం ఓ పని చేస్తున్నప్పుడు ఎన్నో కామెంట్స్, ట్రోల్స్, నెగిటివిటీ వస్తుంటాయి. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేయాలి. మొదట బాగాలేదు అన్నవారే.. ట్రైలర్ వచ్చాక ఎంతో బాగా నటించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే రూమర్స్ ఎక్కువగా పట్టించుకోకుండా మన పని మనం శ్రద్ధగా చేసుకుంటే పోవాలి’ అని తెలిపింది.

అలాగే.. ‘వీరమల్లు’ పార్ట్-2పై అప్డేట్ ఇస్తూ ‘మొదట ‘వీరమల్లు’ను ఒకే పార్ట్‌గా రూపొందించాలి అనుకున్నారు. కానీ, కథ విస్తృతంగా ఉండటంతో రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్ట్ 2కి సంబంధించిన 20 నిమిషాల సీన్స్ షూట్ పూర్తయ్యాయి. వీరమల్లు పార్ట్ 2లో నా పాత్ర మరింత కీలకంగా కనిపించనుంది. అలాగే, రెండో భాగం మీరు ఎక్స్‌పెక్ట్ చేసే దానికంటే కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story