ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

by Sujitha Rachapalli |

‘రాజా సాబ్’తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా : ‘రాజా సాబ్’తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తను పని చేసిన స్టార్ హీరోల గురించి క్యూట్ వర్డ్స్ చెప్పింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరో కన్నా మంచి మనిషి అని కాంప్లిమెంట్స్ ఇచ్చిన నిధి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. ‘ది రణ్‌వీర్ షో’లో ఇందుకు సంబంధించిన కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ సింహం లాంటి వ్యక్తి అని.. ఒంటరిగా నిలబడి పోరాడగల ధైర్యం, నిజాయితీ, బోల్డ్‌నెస్ ఆయనకు ఉందని తెలిపింది. ప్రజల కోసం, తన సిద్ధాంతాల కోసం రాజీపడకుండా నిలబడతాడని.. ఏ విషయం గురించైనా భయపడకుండా బహిరంగంగా మాట్లాడగలడని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు దేవుడితో సమానమైన క్రేజ్ ఉందని.. భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రి అయినా ఏ మాత్రం ఆశ్చర్యం ఉండదని అభిప్రాయపడింది. రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలనూ ప్రభావితం చేయగలడని తెలిపింది నిధి.

Next Story