లులు మాల్ ఇష్యూ..శివాజీపై నిధి షాకింగ్ పోస్ట్ !

by velandi.Saikiran |   (  Updated:2025-12-24 13:24:18  IST  )

శివాజీని ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. లులు మాల్ ఈవెంట్ సందర్భంగా నిధి అగర్వాల్

లులు మాల్ ఇష్యూ..శివాజీపై నిధి షాకింగ్ పోస్ట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి ఆయన గురించే చర్చ జరుగుతోంది. హీరోయిన్ల బట్టలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రచ్చ రచ్చ చేశారు శివాజీ. దీంతో శివాజీ ఎపిసోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. లులు మాల్ ఈవెంట్ లో దిగిన ఫోటోలు స్టోరీగా పెట్టి మరీ, నిధి అగర్వాల్ రియాక్ట్ అయ్యారు. బాధితురాలిని నిందిస్తూ సానుభూతి పొందడం సరికాదు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

దీంతో ఆమె చేసిన పోస్టు నటుడు శివాజీని ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. లులు మాల్ ఈవెంట్ సందర్భంగా నిధి అగర్వాల్ బట్టలపై కూడా లేటెస్ట్ గా శివాజీ కామెంట్స్ చేశారు. ఆ ఈవెంట్ సందర్భంగా నిధి డ్రెస్ జారిపోతే, పరిస్థితి ఎలా ఉండేది ? ఆమె వీడియోలు ఇప్పటికీ వైరల్ అయ్యేవి అంటూ వ్యాఖ్యానించారు. ఆ సందర్భంగా నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన పరిస్థితిని సూచిస్తూ తాను హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్ చేశానని శివాజీ వెల్లడించారు. అయితే ఆయన చేసిన ఈ కామెంట్ల నేపథ్యంలో వెంటనే నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, శివాజీకి ప‌రోక్షంగా కౌంట‌ర్‌ ఇచ్చారు. దీంతో ఇప్పుడు నిధి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. క్లిక్

Next Story