- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెక్స్ట్ మంత్ నన్ను కూడా ఇలా ఈ అవతారంలో చూడోచ్చు.. అనుపమ షాకింగ్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పరదా'(Paradha).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పరదా'(Paradha). ఈ సినిమాను డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) సోషియో డ్రామా జానర్లో తెరకెక్కించారు. శ్రీధర్ మక్కువ(Sridhar Makkuva), విజయ్ డొంకాడ ఆనంద మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో దర్శన రాజేంద్రన్(Darshana Rajendran), టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సంగీత(Sangeetha) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రం ఆగస్టు 22న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈక్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమా చూసేందుకు వచ్చిన కొందరు మహిళలు విభిన్నమైన వేషధారణలో థియేటర్‌కు వచ్చారు. తమ చీరను తలకు పరదాలాగా కప్పుకుని సందడి చేశారు. రెడ్ కలర్ శారీలో వచ్చిన వీరు.. సినిమా స్టార్ట్ అయ్యాక కూడా తమ మొహాలు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను అనుపమ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నెక్ట్స్ మంత్ నన్ను అండ్ మా ఫ్రెండ్స్‌ని మీరు ఇలా అక్కడ ఇక్కడ చూడొచ్చు. ఆగస్టు 22న పెద్ద స్క్రీన్లో కూడా చూస్తారు’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కింద నెటిజన్లు ఈ ఐడియా అద్దిరిపోయిందని.. పవన్ సినిమా థియేటర్లలో తమ మూవీ ప్రమోషన్ చేసుకుంటే ఇంకా హైప్ పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. లింక్






