- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెక్స్ట్ అనౌన్స్‌మెంట్ లోడింగ్.. ధనుష్ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘D55’ ఒకటి. ఈ మూవీకు అమరన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నది.
అలాగే ఈ సినిమాను గోపురం ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్న మూవీ టీమ్ తాజాగా మరో అప్‌డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘కొన్ని కథలు 'S' కోసం వేచి ఉన్నాయి..
మీకు తెలిసిన స్త్రీ, మీరు చేయని పాత్ర.. D55 - తదుపరి ప్రకటన ఈరోజు సాయంత్రం 5 గంటలకు లోడ్ అవుతోంది’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమాలో ఎస్ అక్షరంతో స్టార్ట్ అయ్యే హీరోయిన్ కూడా భాగం కాన్నట్లు తెలుస్తోంది. మరి ఆమె ఎవరో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.
Read More..






