- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తతో విడాకులు తీసుకోబోతున్న నయనతార అంటూ వార్తలు.. దీనిపై ఆమె రియాక్షన్ ఇదే.. పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ చిన్నది మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘మెగా-157’(Mega-157)లో నటిస్తోంది. ఇక దీనికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా నయనతార దంపతులు విడిపోనున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ పలు పుకార్లు నెట్టింట షికార్లు చేశాయి. అయితే వీటిపై తాజాగా నయనతార స్పందించారు.
ఈ మేరకు తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘మాపై వచ్చే సిల్లీ న్యూస్‌కి మా రియాక్షన్ ఇదే..’ అంటూ అసత్య ప్రచారాలకు చెక్ పెట్టేశారు. కాగా కొన్ని రోజుల క్రితం స్వయంగా నయనతార.. ‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు..’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. అయితే.. ఏమైందో ఏమో.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పోస్ట్‌ని డిలీట్ చేసేశారామె. అయితే.. అప్పటికే ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ విపరీతంగా వైరల్ అయిపోయాయి. దీంతో విడాకులు అంటూ ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పందించి క్లారీటీ ఇచ్చింది.






