- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 లాగే రాజాసాబ్ కూడా వాయిదా..క్లారిటీ ఇచ్చిన నిర్మాత !
ది రాజా సాబ్ వాయిదా పడబోతున్నట్లు కూడా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఊహగానాలపై

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనాన్షియల్ కారణాల వల్ల డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. దీంతో బాలయ్య అభిమానులు అందరూ నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ పైన పడుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
ది రాజా సాబ్ వాయిదా పడబోతున్నట్లు కూడా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఊహగానాలపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. ఇండస్ట్రీ సంబంధించిన సినిమా విడుదలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చాలా దారుణమని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు. ది రాజా సాబ్ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను ఇప్పటికే క్లియర్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక మిగిలిన వడ్డీని త్వరలోనే చెల్లిస్తామని పోస్ట్ పెట్టారు. అలాగే అఖండ 2 రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. దీంతో ది రాజా సాబ్ జనవరి 9వ తేదీనే రిలీజ్ కానుందని అంటున్నారు.






